Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూపీ గవర్నర్ రామ్ నాయక్ కు అస్వస్థత... ఆసుపత్రిలో చేరిక

ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ నేటి ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నేటి ఉదయం ఉన్నట్టుండి ఆయన తీవ్రమైన ఛాతీ నొప్పికి గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు వెనువెంటనే లక్నోలోని పీజీఐ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రామ్ నాయక్ కు చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వైద్యులు మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ ను విడుదల చేయనున్నారు.

More Telugu News